Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ పండగ నాకు ‘తలై పొంగల్’ : సినీ నటి సమంత

  • పెళ్లైన తర్వాత వచ్చే సంక్రాంతిని ‘తలై పొంగల్’ అంటారు
  • అక్కినేని ఇంటికి కొత్త కోడలినే కాదు, పెద్ద కోడలిని కూడా
  •  బంధువులంతా బాగా పరిచయమవుతున్నారు: సమంత
పెళ్లైన తర్వాత వచ్చే సంక్రాంతిని చెన్నైలో ‘తలై పొంగల్’ అంటారని, ఈ పండగ తనకు ‘తలై పొంగల్’ అని ప్రముఖ సినీ నటి సమంతా అక్కినేని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అక్కినేని ఇంటికి కొత్త కోడలిని, పెద్ద కోడలిని అని, తమ ఇంట్లో తలై పొంగల్ సందడి మొదలైందని చెప్పింది.

ఇప్పుడిప్పుడే భర్త తరఫు బంధువులంతా బాగా పరిచయం అవుతున్నారని, వరసలు అలవాటవుతున్నాయని తెలిపింది. నాగచైతన్యను పెళ్లి చేసుకుని కొత్తకాపురంలో అడుగుపెట్టడమే ఈ ఏడాది తన సంక్రాంతి స్పెషల్ అని, అందరం కలిసి ఉండటమే సంతోషంగా ఉంటుందని చెప్పింది. ప్రతి ఒక్కరి ముఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోందని తెలిపింది.
samantha
Nagarjuna

More Telugu News